నేను ఒక సంవత్సరం నుండి తెలుగు నేర్చుకుంటున్నాను. నేను ఒక భాష నేర్చుకోవడం ఇదే మొదటిసారి. నేను చాలా తప్పులు చేశాను. నాకు ఇష్టమైన తప్పు నేను చెప్తాను.... ఒక సారి నేను ఒక తెలుగు లెస్సన్ త్రిమూర్తులు గారు తో (my italki teacher) చదువుకున్నాను. అతను నన్ను అడిగారు 'translate...She wore a blue saree' అన్నారు. నేను చీర చెప్పలేదు....నేను చీమ చెప్పాను. కాబట్టి నేను 'ఆమె నీలం రంగు చీమ కట్టుకున్నది' అన్నాను!!!